చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు..

చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు... హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన ఆయన.. అనంతరం ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలైనందుకు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి... వైఎస్ జగన్ గెలుపొందినందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. దీంతో ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరిందని వ్యాఖ్యానించిన ఆయన... దశమగ్రహం అంతరించి పోయినందుకు సంతోషంగా ఉంది.. నరరూప రాక్షసుడు అంతరించిపోయినందుకు ఆనందంగా ఉంది. ఇది, ఏపీ ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మేలైన రోజు.. చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపినందుకు జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఈ దుర్మార్గుడు సీఎంగా ఉండొదద్దని ఎన్టీఆర్ కోరుకున్నాడని గుర్తుచేసిన మోత్కుపల్లి... చంద్రబాబు దొంగ, ప్రజాద్రోహి. నిజస్వరూపం బయట పడేందుకు 25 సంవత్సరాలు పట్టిందన్నారు. ఎవరినైనా వాడుకుని వదిలేసే నీచ సంస్కృతి ఉన్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. నేను ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయల్లోకి వచ్చా.. చంద్రబాబు ఇంటి దగ్గర కాపలాగా కుక్కలా ఉన్న నన్ను మోసం చేశారని.. రాజ్యసభ సీట్లు ఒక్కొక్కటి వంద కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. నాకు గవర్నర్, రాజ్యసభ పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి విజయవాడకు పారిపోయారని విమర్శించిన మోత్కుపల్లి.. తెలంగాణలో పార్టీని బతికించుకుంటా అన్నందుకు నన్ను పార్టీ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు చంద్రబాబును తరిమి కొట్టారు... ఏపీ ప్రజలు కూడా తన్ని తరిమి కొట్టారని వ్యాఖ్యానించిన మోత్కుపల్లి.. కేంద్రంలో చక్రం తిప్పుతా అన్నావ్... అది పిప్పర్ మెంట్ చక్రం అంటూ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని నాశనం చేశావు.. దళితులకు అన్యాయం చేశావ్ అని.. తప్పులు సరిదిద్దుకున్నేడో లీడర్... తప్పుల మీద తప్పులు చేసే వాడు నాయకుడు కాదన్నారు. ఇక 3500 తిరుపతి మెట్లు ఎక్కి దేవున్ని దర్శించుకున్నాను. చంద్రబాబును ఓడించాలని వెంకటేశ్వరస్వామిని మొక్కుకున్నా.. నా మొక్కు ఫలించిందన్నారు మోత్కుపల్లి. మరోవైపు నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం జెండా నీది కాదు.. నందమూరి వాళ్ల జెండాయేనని.. చంద్రబాబు ఇక సెలవు తీసుకో.. నువ్వు పెద్ద కొడుకువి కాదు.. పెద్ద తాతవు.. పెద్ద కొడుకు అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు మోత్కుపల్లి.