ఓటు వేసిన రాజకీయ, సినీ ప్రముఖులు !

ఓటు వేసిన రాజకీయ, సినీ ప్రముఖులు !

రెండవ దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం ఆరంభమైంది.  ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.  సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.    కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భార్య అనిత, కొడుకు నిఖిల్‌తో కలిసి రాంనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.  చెన్నైలోని తెనంపేటలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఓటు వేశారు.  

మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ కుమార్తె శృతి హాసన్ తో కలిసి ఆల్వార్‌పేటలో ఓటు వేయగా నటులు సూర్య, కార్తీ, విజయ్, అజిత్, జ్యోతిక ఓటు హక్కును వినియోగించుకున్నారు.  తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఎడప్పాడిలో ఓటు వేశారు.  నటుడు, బెంగళూరు సెంట్రల్‌  స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రకాశ్‌ రాజ్‌, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌,, కాంగ్రెస్ సీనియర్ నేతలు పి.చిదంబరం, సుశీల్‌ కుమార్‌ షిండే ఓటు హక్కు వినియోగించుకున్నారు.