సంక్రాంతి పోరులో తలపడే పుంజులివే..

సంక్రాంతి పోరులో తలపడే పుంజులివే..

ప్రతి ఏడాది సంక్రాంతి వచ్చిందంటే థియేటర్ల దగ్గర సందడి ఒక రేంజ్‌లో ఉంటుంది. సపరివార సమేతముగా అందరూ సినిమాలు చూసేందుకు వీచ్చేస్తారు. కానీ ఈ సారి కరోనా కారణంగా ఆ సందడి ఉంటుందో లేదో అన్న సందేహాలు ఉన్నాయి. ఈ కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందన్న వార్తలు ప్రజల్లో పాజిటివ్ ఆలోచనలను తీసుకొస్తోంది. ఇలానే కొనసాగితో కొన్నాళ్లలో మామూలుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కానీ సంక్రాంతికి అంత టైం లేదు. దాంతో ఈ పరిస్థితులలో సినిమా విడుదలయితే పెట్టిన బడ్జెట్ కూడా వసూలు కాదేమో అని నిర్మాతలు సందేహిస్తున్నారు. దానికి తోడు కేవలం యాభైశాతం ప్రేక్షకులు మాత్రమే ఉండాలన్న నిబందన నిర్మాతల భయాన్ని మరింత పెంచుతోంది. మరి ఈ సంక్రాంతి తలపడనున్న పుంజులు ఏవేవి అనేది అర్థం కావడంలేదు.

అసలు పోటీ ఉందా అన్నా అనుమానాలు కూడా రాకపోలేదు. వాటిని దూరం చేస్తూ క్రిస్మస్‌కు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సాయి ధరమ్ వస్తున్నాడు. ఆ తరువాత అసలు పోటీ మొదలు కానుంది. సంక్రాంతికి తలపడనున్న పుంజుల ఏవో ఓ లుక్కేద్దాం రండి.. రవితేజ, శ్రుతి హాసన్ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ క్రాక్ సినిమా ఈ సంక్రాంతికి కచ్చితంగా వస్తుందని తెలిపింది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్‌గా రవితేజ మాస్ యాంగిల్‌లో కనిపించనున్నాడు. మరోకటి రానా దగ్గుపాటి చేసిన అరణ్య సినిమా. ఇందులో ఆటవిక మనిషిగా రానా చేశాడు. అడవిని కాపాడే నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తోంది. వాటితో పోటీ పడేందుకు అక్కినేని యంగ్ హీరో అఖిల్ రానున్నట్లు సమాచారం.

అఖిల్ అక్కినేని, పూజా హిగ్దే కలిసి నంటించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా సంక్రాంతి పోరులో నిలబడనుందని వార్తలు వస్తున్నాయి. మొదట టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ చేసిన రెడ్ సినిమా కూడా సంక్రాంతికి వస్తుందన్నారు. కానీ రెడ్ గణంతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కానుందని తాజా సమాచారం. అయితే ఈ సంక్రాంతికి తలపడున్న పుంజుల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.