ఫైర్ ఫాక్స్ నుంచి వీఆర్ ఎంజాయిమెంట్

ఫైర్ ఫాక్స్ నుంచి వీఆర్ ఎంజాయిమెంట్

ప్రముఖ వెబ్ బ్రౌజర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ తాజాగా వీఆర్ వెబ్ బ్రౌజర్ ను ప్రవేశపెట్టింది. గూగుల్ క్రోమ్ లాగా డెస్క్ టాప్ మీద వాడే మొజిల్లా ఫైర్ ఫాక్స్ గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. అయితే తొలిసారిగా మాత్రం వర్చువల్ రియాలిటీ (వీఆర్) బ్రౌజర్ ను తీసుకొచ్చింది. వెర్షన్ 1.0 గా పిలుస్తున్న దీని పర్ఫామెన్స్ ను గమనిస్తున్నారు. యూజర్స్ అనుభవాలను కూడా రికార్డు చేస్తున్నారు. 

ఫైర్ ఫాక్స్ రియాలిటీ వెబ్ బ్రౌజర్ ను పూర్తిగా వీఆర్ హెడ్ సెట్ తోనే ఆపరేట్ చేయొచ్చు. యూఆర్ఎల్స్ ఉపయోగించడం, సర్చ్ చేయడంతో పాటు 2డీ, 3డీ ఇంటర్నెట్ ను కూడా వీఆర్ బ్రౌజర్లో ఎంజాయి చేయొచ్చు. ముఖ్య విషయమేమంటే.. మౌజ్ లేకుండా.. కేవలం వీఆర్ హ్యాండ్ కంట్రోలర్ ద్వారానే దీన్ని ఆపరేట్ చేయొచ్చని చెబుతున్నారు. 

ఫైర్ ఫాక్స్ రియాలిటీ ఆక్యులస్, వైవ్ పోర్ట్, డేడ్రీమ్ ప్లాట్ ఫామ్స్ లలో ఇది లభ్యమవుతోంది. ఆక్యులస్ గో, లెనోవా మిరేజ్ సోలో వంటి లేటెస్ట్ మొబైల్ హెడ్ సెట్స్ కు కూడా సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందించారు. త్వరలోనే డెస్క్ టాప్ తో పాటు అన్ని మొబైల్ వెర్షన్స్ లో కూడా ఉపయోగించేలా కసరత్తు నడుస్తోంది. ఈ ప్రయోగంతో రెగ్యులర్ కంప్యూటర్ వర్క్ ను కూడా వర్చువల్ గేమింగ్ పద్ధతిలో ఎంజాయి చేయొచ్చు.