'జైలుకు వెల్లడానికైనా సిద్దం'

'జైలుకు వెల్లడానికైనా సిద్దం'

రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే జైలుకు వెల్లడానికైనా ఏంపీలు సిద్దంగా ఉన్నారు అని ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. రైల్వేజోన్ కోసం విశాఖలో టీడీపీ నేతలు ఒక్కరోజు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ అవంతి మాట్లాడుతూ... హామీల అమలు కోసం నాలుగేళ్లు ఎదురుచూశామని.. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా  కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే జైలుకు వెల్లడానికి ఏంపీలు సిద్దంగా ఉన్నారు అని తెలిపారు. ఎంపీలు ప్రధాని వద్దకు వెళ్తే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని అవంతి పిలుపునిచ్చారు. రైల్వే జోన్ వచ్చేవరకూ ఉద్యమం ఆగదు.. వినుత్నరీతిలో నిరసనలు తెలుపుతాం అని పేర్కొన్నారు. ఆంధ్ర వాళ్ళ పౌరుషం ఏంటో డీల్లీకి చూపిద్దాం అని అవంతి కోరారు.