పవన్ హీరోయిన్ కు కోర్టు నోటీసులు 

పవన్ హీరోయిన్ కు కోర్టు నోటీసులు 

పవన్ కళ్యాణ్ బద్రి సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు.  అందులో ఒకరు అమీషా పటేల్.  అదే ఆమె మొదటి తెలుసు సినిమా.  తన పెరఫార్మన్స్ తో ఆకట్టుకుంది.  సినిమాకు విజయానికి ఆమెకూడా కొంత ప్లస్ అయ్యింది.  ఆ తరువాత తెలుగులో నాని, నరసింహుడు, పరమవీర చక్ర వంటి సినిమాల్లో నటించింది.  అటు బాలీవుడ్ లోను మంచి సినిమాలు చేసి పేరు తెచ్చుకుంది.  

హీరోయిన్ గా బాలీవుడ్ లో సైతం మంచిపేరు తెచ్చుకున్న అమీషా పటేల్ ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి రూ. 10 లక్షలు అప్పుగా తీసుకుంది.  ఆ తరువాత ఆ ప్రొడక్షన్ హౌస్ కు ఓ చెక్ ఇచ్చింది.  కానీ, ఆ చెక్ బౌన్స్ కావడంతో ప్రొడక్షన్ కంపెనీ కోర్టులో చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసింది.  కేసు విచారించిన మధ్యప్రదేశ్ కోర్టు 43 ఏళ్ల అమీషా పటేల్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 27 వ తేదీలోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.