ప్రజలు శిక్షించినా ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు

ప్రజలు శిక్షించినా ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు

రాఫెల్‌ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఖండించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ప్రజలు శిక్షించినా ఇంకా గుణపాఠం నేర్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో ఘోరంగా విఫలమైందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.