గల్లా ప్రసంగంపై టీఆర్ఎస్ అభ్యంతరం

గల్లా ప్రసంగంపై టీఆర్ఎస్ అభ్యంతరం

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంపై టీఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కాదన్నారు. ఏపీ మాత్రమే కొత్త రాష్ట్రమన్నారు. జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మందబలంతో, వివక్షతతో అన్యాయంగా గొంతునొక్కి విభజన బిల్ పాస్ చేశారని ఆరోపించారు. తెలంగాణకు ఆస్తులు...ఏపీకి అప్పులు ఇచ్చారని అన్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. తమ స్థానాల్లో నిలబడి ఆందోళన తెలిపారు. ఎంపీ గల్లా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. వెంటనే మేడమ్‌ స్పీకర్‌ జోక్యం చేసుకోవటంతో ప్రసంగం కొనసాగింది.