టీడీపీని భూస్థాపితం చేసే రోజులు దగ్గరపడ్డాయి

టీడీపీని భూస్థాపితం చేసే రోజులు దగ్గరపడ్డాయి

ఏలూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ ప్రజా ఆవేదన ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీజేజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, పురంధేశ్వరి, జీవీఎల్‌, మాణిక్యాలరావు హజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ జీవిఎల్ నరసింహరావు టీడీపీపై విరుచుకుపడ్డారు. టీడీపీని భూస్థాపితం చేసే రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో సీనియర్‌నని చంద్రబాబు విర్రవీగుతున్నారన్నారని విమర్శించారు. అవినీతిపరులపై ఐటీ దాడులు జరిగితే.. తమపై జరిగిన దాడులుగా టీడీపీ వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని ఎంపీ జీవీఎల్ విమర్శించారు.