ఆపరేషన్ "నరుడా" జరుగుతోంది

ఆపరేషన్ "నరుడా" జరుగుతోంది

ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడా కాదు ఆపరేషన్ నరుడా జరుగుతోందని రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహా రావు విమర్శించారు.  2019లో ఆపరేషన్ నరుడా అమలవుతుందని ఆయన విశాఖలో జోస్యం చెప్పారు. ఎయిర్ పోర్టులో జరిగిన దాంతో తమకు సంబంధం లేదనటం సరైందికాదని ఆయన తెలిపారు. సీఎం రమేష్  తెలుగు విజయ్ మాల్యాగా తయారయ్యారా ? అని ప్రశ్నించారు. హాయ్ ల్యాండ్ పై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు గిలగిల కొట్టుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ పోరాటంతో అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలన్న ఆలోచన కాస్త వెనక్కు తగ్గిందని స్పష్టం చేశారు.  ఇక్కడ సమాధానం చెప్పలేని సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. వ్యాపారస్తులు, దొంగ నాయకులపై ఐటీ దాడులు చేస్తుంటే మంత్రులు, సీఎంకు ఎందుకు భయమని నిలదీశారు. చంద్రబాబు... కోతల రాయుడు, అబద్ధాల రాయుడిగా మిగిలి పోతున్నారని విమర్శించారు. ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా అప్పులు, ఆర్భాటాలు ఎక్కువ అని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే అన్ని పార్టీలు ఖండించడం సహజమని తెలిపారు. కానీ చంద్రబాబు స్పందన మాత్రం విడ్డూరంగా ఉందని విమర్శించారు జీవీఎల్. ఈ సారి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా తెలుగుదేశానికి దక్కదని జీవిఎల్ జోస్యం చెప్పారు.