బీజేపీలో చేరిన టీఆర్ఎస్ కీలకనేత

 బీజేపీలో చేరిన టీఆర్ఎస్ కీలకనేత

లోక్ సభలో టీఆర్ఎస్ పక్షనేత, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల అభ్యర్ధుల జాబితాలో జితేందర్‌కు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో ఫోన్ లో చర్చలు జరిపారు. ఫలించడంతో బుధవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు సమక్షంలో తిరిగి సొంతగూటికి జితేందర్ రెడ్డి చేరుకున్నారు.

విద్యార్ధి దశలోనే జితేందర్‌ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్లో చురుగ్గా పనిచేశారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. 2014లో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.