క్యాన్సర్ విషయంలో ఇంకా ఎంతో చేయాలి...

క్యాన్సర్ విషయంలో ఇంకా ఎంతో చేయాలి...

క్యాన్సర్ విషయంలో ఎంత చేసినా ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు ఎంపీ కవిత... బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ... క్యాన్సర్‌తో భారత దేశంలో ప్రతి ఏడాది ఐదున్నర లక్షల మంది చనిపోతున్నారని, దేశంలో కొత్తగా 7 లక్షల మందికి క్యాన్సర్ వస్తుందని... క్యాన్సర్ ను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం కేసీఆర్ 50 వేల మంది బోధకాలు వ్యాధి గ్రస్థులకు నెలకు రూ. వెయ్యి చొప్పున ఇస్తున్నారని తెలిపారు కవిత... క్యాన్సర్ కు సంబంధించి ప్రభుత్వం వైద్యం అంతగా అందుబాటులో లేదన్నారామె. 

తెలంగాణలో జిల్లాకో క్యాన్సర్ స్క్రినింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఎంపీ కవిత... ప్రతి ఒక్కరూ క్యాన్సర్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. 1989లో 50 పడకలతో క్యాన్సర్ హాస్పిటల్ ను ప్రారంభిస్తే... బాలకృష్ణ ముందుకు తీసుకువెళ్లడం అభినందనియం అన్నారు కవిత. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా బాగా రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. బ్రేస్ట్ క్యాన్సర్, సర్వైవకాల్ క్యాన్సర్‌పై మహిళలు ప్రతీ సంవత్సరం పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరు తమ పుట్టినరోజు వాళ్ల అమ్మకి క్యాన్సర్ టెస్ట్‌లు చేయించాలని సూచించిన కవిత... క్యాన్సర్‌ని తొలిదశలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చన్నారు.