వీరశైవ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ కవిత

వీరశైవ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ కవిత

బసవేశ్వరునికి తెలంగాణ సమాజానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. బోధన్ లో జరిగిన వీర శైవ జంగమ సమాజ్, వీర శైవ లింగాయత్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ, తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పాలన, ఇలా ఉండాలి అని బసవేశ్వరుడు 800 ఏళ్ల క్రితమే చెప్పారని అన్నారు. పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుకు ఇక్కడ ఏం పని అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టును అమరావతిలో చంద్రబాబు టిక్కులు పెట్టాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. 

బంగారు తెలంగాణ నిర్మాణం జరిగేంత వరకు పోరాడతాం, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గత 15 ఏళ్ళు అధికారంలో ఉండి బోధన్ కు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఇప్పుడు చివరి సారి ఒక్కసారి గెలిపించాలని కోరుతున్నారు, జగిత్యాలలో జీవన్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో చివరి సారి గెలిపించండి అంటూ ప్రజలను వేడుకున్నారని ఆమె గుర్తుచేశారు. జంగమ సమాజ్ వారికి కుల ధ్రువీకరణ పత్రంపై సీఎం దృష్టికి తీసుకెళతామని ఎంపీ కవిత హామీ ఇచ్చారు.