ఆయనలా దిగజారి మాట్లాడలేను: కవిత

ఆయనలా దిగజారి మాట్లాడలేను: కవిత

కాంగ్రెస్ లీడర్ మధు యాష్కీ వాడిన భాష బాగాలేదు.. ఆయనలా దిగజారి మాట్లాడలేను అని ఎంపీ కవిత అన్నారు. మంగళవారం కవిత నిజామాబాద్ లో మాట్లాడుతూ... లక్కమ్ పల్లి సెజ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎంపీ నిధుల కింద మూడున్నర కోట్ల రూపాయల నిధులు వెనక్కి వెళ్లాయి, ఆ నిధులను నేను తీసుకొచ్చాను అని కవిత అన్నారు. రైల్వే పనులు మేము చేసినా చేయలేదని చెబుతున్నారు, నేను ఎంపీ అయ్యాక 500 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేశామని రైల్వే వారే చెబుతున్నారు అని పేర్కొన్నారు. ఎన్నడూ నిజామాబాద్ ప్రజలను మధు యాష్కీ సొంతం చేసుకోలేకపోయాడు అని విమర్శించారు. నువ్వు ఎంపీగా ఉన్న సమయంలో ఎన్ని ఊర్లు తిరిగావు అని ప్రశ్నించింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీద  దుమ్మెత్తిపోశావ్.. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని కవిత హెచ్చరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.