గల్లీలో సేవకులం : కవిత

గల్లీలో సేవకులం : కవిత

 

నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత కాంగ్రెస్ , బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.  కాంగ్రెస్ పార్టీ మైదానాలోనే లేకుండా పోయిందన్న ఆమె బీజేపీ అబద్దాలు మరోసారి రుజువయ్యాయని అన్నారు.  ఇప్పటికే 900 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్న ఆమె త్వరలో పేదలందరికీ పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని, ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీ హబ్ ఏర్పాటు జరుగుతోందని, చక్కర ఫ్యాక్టరీ తెరిపిస్తామని అన్నారు.  బిజేపి, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి.  టీఆరెస్ పార్టీ సెక్యులర్ పార్టీ.  ఢిల్లీలో ఉంటే సైనికులుగా, గల్లీలో సేవకులుగా ఉంటాం.  ప్రజల కోసం పనిచేసే పార్టీలను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది.  గులాబీ జెండా ఉంటేనే శ్రీరామ రక్ష అని అన్నారు.