ఎంపీ మురళీమోహన్ సంచలన నిర్ణయం

ఎంపీ మురళీమోహన్ సంచలన నిర్ణయం

టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు దగ్గర జరిగే సమావేశంలో తన నిర్ణయాన్ని తెలపనున్నారు మురళీమోహన్. అయితే, చారిటబుల్ ట్రస్టు కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం కావడానికే పోటీ చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే అమలాపురం ఎంపీ రవీంద్ర.. టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరగా... ఇక కాకినాడ ఎంపీ తోట నరసింహం తాను పోటీచేయబోను అంటున్నారు. ఈ నేపథ్యంలో మురళీ మోహన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.