జీవీఎల్ తప్పుదోవ పట్టిస్తున్నారు

జీవీఎల్ తప్పుదోవ పట్టిస్తున్నారు

ఏపీ ప్రజలను జీవీఎల్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి. పారిశ్రామిక కారిడార్లతో ఉద్యోగాలు వస్తాయనీ...  రాష్ట్రానికి కేంద్రం అన్నీ చేస్తుందనీ ఆయన అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంలో కొత్తేమీ‌లేదని గుర్తు చేశారు.  రూ.1200 కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ వచ్చాయని సభను జీవీఎల్ తప్పుదోవ పట్టించారని విమర్శించారు.   ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు అన్నీ ఇవ్వాల్సిందేనని సుజనా డిమాండ్ చేశారు. ఏపీకి సహాయపడేలా జీవీఎల్ నడుచుకోవాలని సూచించారు.  స్పెషల్ పర్పస్ వెహికల్ ఏవిధంగా ఉండాలో విధివిధానాలు రూపొందించలేదని తెలిపారు.  జీవీఎల్ తో చర్చకు‌ సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.  తాను ఒక్కడినే జీవీఎల్ కు సమాధానం చెబుతానని సుజనా పేర్కొన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయానికి ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రత్యేక హోదా పోరాటంలో తెలంగాణ ‌సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. ఏపీని ఊబిలోకి నెట్టేసింది కాంగ్రెస్ మాత్రమేనని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక ‌హోదా ఇస్తామనడం కాంగ్రెస్ కు భావ్యం కాదని సుజనా చౌదరి పేర్కొన్నారు.