టీడీపీకి భారీ షాక్.. వైసీపీలో చేరిన ఎంపీ తోట..

టీడీపీకి భారీ షాక్.. వైసీపీలో చేరిన ఎంపీ తోట..

తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చిన కాకినాడ ఎంపీ తోట నర్సింహం... తన ఫ్యామిలీతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య అనుచరులతో హైదరాబాద్ వచ్చిన ఆయన... లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తోట నర్సింహం, తోట వాణి, వాళ్ల కుమారుడు, ఇతర నేతలకు పార్టీ కండువా కప్పి... వైసీపీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇక పెద్దాపురం వైసీపీ అభ్యర్థిగా తోట వాణిని ప్రకటించే అవకాశం ఉంది., తోట నర్సింహం అనారోగ్య కారణాల వల్ల ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. అయితే తన భార్య వాణికి జగ్గంపేట టిక్కెట్టు ఇవ్వాలని కొద్దిరోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. జగ్గంపేట సీటు నెహ్రూకి ఖాయం చేసిన చంద్రబాబు.. నర్సింహం భార్యకు సీటు విషయంలో హామీ ఇవ్వలేదు. నర్సింహం సోమవారం మరోసారి సీఎంను కలిశారు. వాణికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి.. ముందుగా టీడీపీ విజయం కోసం కృషి చేయమని చెప్పారు. సీఎం చంద్రబాబు మాటతో సంతృప్తి చెందని తోట టీడీపీకి రాజీనామా చేసి... వైసీపీలో చేరారు.