టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటీ..? టీజీ

టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటీ..? టీజీ

టీడీపీ,జనసేన మధ్య పెద్దగా  విభేదాలు లేవని ఎంపి టిజి.వెంకటేష్ చెబుతున్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ. కేవలం కేంద్రం పై పోరాటం చేసే  విషయం లోనే రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారాయన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సీఎం కుర్చీ పై ఆశ  లేదని చెప్పుకొచ్చారు టీజీ వెంకటేష్.. యూపిలో సమాజ్ వాదీ పార్టీ, బిఎస్పీ కలవగాలేంది... రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ రాజ్యసభ ఎంపి  స్పష్టం చేశారు. మార్చ్ నెలలో  సీట్ల సర్దుబాటు చర్చలు ఉండొచ్చని వ్యాఖ్యానించారు.