చంద్రబాబుపై సీఈసీకి ఫిర్యాదు..

చంద్రబాబుపై సీఈసీకి ఫిర్యాదు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ఎన్నికల వేళ హింసను ప్రేరేపించే విధంగా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించిన ఆయన.. కడప జిల్లాకు చెందిన కొంతమంది పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్‌లో గొడవలు సృష్టించే విధంగా టీడీపీ నాయకులు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్న సాయిరెడ్డి.. ఎన్నికలకు ఒక్కరోజు ముందు చంద్రబాబు నాయుడు ఎన్నికల అధికారుల వద్దకు వెళ్లి వారిని బెదిరించే విధంగా మాట్లాడారని.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అల్లర్లు సృష్టించి ఆ నెపాన్ని వైసీపీపై నెడుతున్నారని, టీడీపీ నేతల దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు సాయిరెడ్డి.