ఉత్తమ్ పై విరుచుకుపడ్డ ఎంపీ వినోద్ 

ఉత్తమ్ పై విరుచుకుపడ్డ ఎంపీ వినోద్ 

తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చేసిన పాపం వల్లనే ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. తెలంగాణకు ఇసుమంతైనా నష్టం వాటిల్లే ఏ నిర్ణయానికి తాము మద్దతు ఇవ్వబోమన్నారు. 

పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామని విభజన చట్టంలో చెప్పిన కేంద్రం.. తెలంగాణలోని ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. దీనికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాదా..? ఉత్తమ్‌కుమార్ చెప్పేవన్నీ అసత్యాలే. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలకు కావాల్సిన అనుమతులన్నీ సాధించామని అన్నారు. ప్రాజెక్టులు అడ్డుకునేలా కాంగ్రెస్ నాయకులు న్యాయస్థానాల్లో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి పన్ను రాయితీలు‌ ఇస్తామని హామీ ఇచ్చారని, తెలంగాణ శ్రేయస్సు మీకు అవసరం లేదా అని ఉత్తమ్‌ను ప్రశ్నించారు.