వాళ్లు మేనిఫెస్టోనే ప్రకటించలేదు.. తామెలా కాపీ కొడతాం

వాళ్లు మేనిఫెస్టోనే ప్రకటించలేదు.. తామెలా కాపీ కొడతాం

కాంగ్రెస్ మేనిఫెస్టోను మక్కీ కి మక్కీ కొట్టారన్న విమర్శలపై టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ వినోద్ మాట్లాడారు. అసలు  కాంగ్రెస్‌ మేనిఫెస్టోనే ప్రకటించలేదని...తామెలా కాపీ కొడతామని ప్రశ్నించారు. 2014 మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశామని, చెప్పనివి కూడా చేశామని తెలిపారు. ప్రజల దీవెనలు కేసీఆర్‌కు మెండుగా ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ 100 సీట్లకు పైగా గెలవడం ఖాయమని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 11 తర్వాత టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు.