గోదావరి బ్రిడ్జిపైగా పాదయాత్ర వెళ్లి తీరుతుంది

గోదావరి బ్రిడ్జిపైగా పాదయాత్ర వెళ్లి తీరుతుంది

గోదావరి బ్రిడ్జిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రకు పోలీసులు అభ్యంతరం తెలపడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి... జగన్ పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక ప్రభుత్వం ఇలాంటి చేష్టలు చేస్తోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలని చూసినా... అనుకున్న ప్రకారం ఈ నెల 12వ తేదీన గోదావరి బ్రిడ్జిపై నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర వెళ్తుందని స్పష్టం చేశారాయన. వందల టన్నుల ఇసుక లారీలు యథేచ్ఛగా తిరిగే గోదావరి బ్రిడ్జిపై ప్రజలు నడిస్తే ప్రమాదమని చెప్పడం హాస్యాస్పదమన్న వైవీ సుబ్బారెడ్డి... జగన్ పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగదన్నారు.