రివ్యూ: మిస్టర్ మజ్ను

రివ్యూ: మిస్టర్ మజ్ను

నటీనటులు : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, నాగబాబు, జయప్రకాశ్, సితార, ప్రియదర్శిని తదితరులు 

సంగీతం: థమన్ 

నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ 

దర్శకత్వం: వెంకీ అట్లూరి 

అఖిల్, హలో సినిమాల తరువాత అఖిల్ చేస్తున్న మూడో సినిమా మిస్టర్ మజ్ను.  ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.  రొమాంటిక్ ప్లే బాయ్ గా అఖిల్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా చూద్దాం.  

కథ: 

అఖిల్ లండన్ లో చదువుతుంటారు.  తన మాటలతో, లుక్స్ తో అమ్మాయిలను పడేస్తుంటారు. లైఫ్ ను జాలీగా లీడ్ చేసే అఖిల్ మనస్తత్వానికి పూర్తి భిన్నంగా ఉండే నిధి అగర్వాల్ తారసపడింది.  అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది.   అఖిల్ మనస్తత్వానికి భిన్నంగా ఉండే నిధితో ప్రేమలో పడతాడు.  నిధి దగ్గర ప్రేమికుడిలా ఉండేందుకు అఖిల్ శతవిధాలా ప్రయత్నిస్తాడు. అఖిల్ గురించి తెలుసుకున్న నిధి అతనితో బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతుంది.  ఆ తరువాత నిజమైన ప్రేమను గురించి తెలుసుకున్న అఖిల్ ఏం చేశాడు..? నిధి ప్రేమను దక్కించుకోవడానికి ఎలా ప్రయత్నించాడు అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

రొమాంటిక్ ప్లే కథతో కూడిన సినిమా ఇది.  అఖిల్ లుక్స్ పరంగా చాలా స్మార్ట్ గా ఉన్నాడు.  ప్లేబాయ్ గా అమ్మాయిలతో సాగించే రొమాంటిజం బాగుంటుంది.  అదే సమయంలో నిధి అగర్వాల్ పరిచయంతో అఖిల్ లైఫ్ మారుతుంది.  ఒకవైపు అఖిల్ ప్లేబాయ్ లైఫ్ ను లీడ్ చేస్తూనే మరోవైపు నిధితో ప్రేమను నడిపించే తీరు ఆకట్టుకుంటుంది.  ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది.  ఎక్కడ ఎలాంటి డిస్టర్బ్ ఉండదు.  అఖిల్ గురించి తెలుసుకున్న నిధి.. అతనికి బ్రేకప్ చెప్పడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.  

సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలౌతుంది.  నిధి వెళ్ళిపోయాక.. ప్రేమంటే ఏంటో తెలుసుకుంటాడు.  ఆ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం అవుతాడు.  ఎలాగైనా నిధిని ప్రేమలో దించేందుకు లండన్ వెళ్లి ప్రయత్నాలు మొదలుపెడతాడు.  నిధిని ప్రేమలో పడేసే సమయంలో వచ్చే ఎమోషన్స్ సినిమాకు బలాన్ని ఇచ్చాయి.  అఖిల్ నటనలో చాలా పరిణితి చెందాడు.  గత సినిమాలతో పోల్చుకుంటే చాలా స్మార్ట్ గా కనిపించాడు.  హీరోయిన్ నిధి అగర్వాల్ కు హీరోతో సమానమైన క్యారెక్టర్ ఇచ్చారు.  అందంతో పాటు నిధి పెర్ఫార్మన్స్ పరంగా కూడా ఆకట్టుకుంది.  సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదించింది.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు వెంకీ మొదటి సినిమా తొలిప్రేమ లాగే రెండో సినిమాను కూడా సున్నితమైన ప్రేమతో కూడిన కథను ఎంచుకున్నాడు.  ఎంచుకున్న పాయింట్ బాగుంది.  కథనాల్లో ఇంకాస్త బలం ఉంటె సినిమా ఇంకా బాగుండేది.  జార్జి ఫొటోగ్రఫీ అందంగా ఉంది.  థమన్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది.  ఎస్.వి.సి.సి నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

సంగీతం 

ఫస్ట్ హాఫ్ 

నెగెటివ్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ 

చివరిగా: మిస్టర్ మజ్ను చాలా రొమాంటిక్ గా ఉన్నాడు.