విజయారెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ మృతి

విజయారెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ మృతి

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి నిన్న సజీవ దహనమైన ఘటన విదితమే.  అయితే ఈ ప్రమాదం నుండి విజయారెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన డ్రైవర్ గురునాథంకు 80శాతం వరకు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం డీఆర్డీవో అపోలోలో చేర్పించారు. విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో తీవ్రగాయాలపాలైన గుర్నాదం  ఈరోజు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత ఎనిమిదేళ్లుగా విజయారెడ్డి వద్దే పనిచేస్తున్న గురునాధం సూర్యాపేట జిల్లా వెలుగొండ గ్రామ వాసి. గురునాధంకు ఏడాదిన్నర కొడుకు ఉండగా.. ప్రస్తుతం ఆయన భార్య 8 నెలల గర్భవతి. దీంతో ఆ కుటుంబసభ్యులు రోదనలు ఆసుపత్రి వద్ద మిన్నంటాయి.