సీఎం కేసీఆర్ దళిత ద్రోహి..

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి..

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ‘అంబేద్కర్‌వాదుల మహాగర్జన’ నిర్వహించారు. పంజాగుట్టలోని అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానించినందుకు, అంబేద్కర్‌ జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనక పోవటాన్ని నిరసిస్తూ ధర్నాచౌక్‌ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొన్నాల, వీహెచ్, అద్దంకి దయాకర్, టీటీడీపీ నేతలు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్,  బీజేపీ నాయకులు రామచంద్రరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తదితరులు హజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. 'సీఎం కేసీఆర్ దళిత ద్రోహి. ఇది మీ పతనానికి నాంది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరుగుతున్నాడు. నీ వెంట మీ సామాజిక వర్గం వారే ఉన్నారు. కేసీఆర్ కు అహంకారం పెరిగింది. దేశానికి దశ దిశ చేసింది అంబేద్కర్. మంద కృష్ణ ఏం తప్పు చేసాడు అరెస్ట్ చేయడానికి... డబ్బు తీసుకుని ఓటు వేయడం వల్ల ఈ పరిస్థితి' అని అన్నారు.