క‌రోనా ప‌రీక్షలు చేయించుకున్న మ‌హేంద్ర సింగ్ ధోని...

క‌రోనా ప‌రీక్షలు చేయించుకున్న మ‌హేంద్ర సింగ్ ధోని...

 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. వచ్చే నెల 17వ తేదీ నుంచి కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 2020 పోటీలు యూఏఈ వేదికగా ప్రారంభంకానున్నాయి. ఈ తరుణంలో ధోనీ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. జట్టు సహచరుడు మోనూ సింగ్‌తో కలిసి రాంచీలో కరోనా టెస్టులకు శాంపిల్స్ ఇచ్చాడు. గురువారం సాయంత్రానికి ధోనీ కరోనా పరీక్షల నివేదిక రానుంది. కాగా  రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కోచ్ కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే.