వైరల్ ఫొటో.. హోటల్ లో ధోనీ, జీవా

వైరల్ ఫొటో.. హోటల్ లో ధోనీ, జీవా

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కుమార్తె జీవా మైదానంలో చాలా సందడి చేస్తుంటుంది. తల్లి సాక్షితో పాటు క్రికెట్ మ్యాచ్ లను చూడడానికి జీవా కూడా స్టేడియంకి వస్తుంది. మ్యాచ్ సాగుతున్న సమయంలో తన చిలిపి పనులతో సందడి చేస్తుంది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం తండ్రితో పాటు మైదానంలోకి వచ్చి డ్యాన్స్‌లు వేయడం వంటివి చేస్తుంటుంది. వీటన్నింటికి సంబంధించిన పోటోలను ధోని, సాక్షి సోషల్ మీడియాలో పెట్టి అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ధోనీ, జీవాల ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఓ హోటల్ లో ధోనీ, జీవాలు కూర్చుని తమ చేతిలో ఉన్న గాడ్జెట్లను చూసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు. ధోనీ తన ఐ ప్యాడ్ ను చూస్తుండగా.. జీవా సైతం తానేమీ తక్కువ కాదంటూ ఓ బుల్లి ఐ ప్యాడ్ ను చూస్తూ కూర్చుంది. వీరిద్దరూ చుట్టుపక్కల పరిసరాలన్నింటిన్నీ పట్టించుకోకుండా ఐ ప్యాడ్ లలో తలమునకై ఉన్నారు. అయితే వీరి ముందున్న టేబుల్ పై సూప్ బౌల్స్, టీ కప్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు.