ఇదే ధోనీ కల..

ఇదే ధోనీ కల..

వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడడమే మహేంద్ర సింగ్‌ ధోనీ కల అని అతని ఆతని స్నేహితుడు, రితి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ మేనేజర్‌ అరుణ్‌ పాండే చెప్పాడు. ఓ మీడియా సంస్థతో అతను మాట్లాడుతూ వరల్డ్‌కప్ ప్రారంభమయ్యేలోపు కొత్త కెప్టెన్‌కి జట్టుపై పూర్తి పట్టు ఉండాలనే ఉద్దేశంతో కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్నాడని చెప్పాడు. కెప్టెన్సీ వదులుకున్నా కోహ్లికి సలహాలు ఇస్తున్నాడని చెప్పాడు. ఇక.. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న ధోనీని.. టీ20ల నుంచి ఇటీవలే తప్పించారు. రిషభ్‌ పంత్‌ రాకతో ధోనీకి వన్డే జట్టులోనూ చోటు అనుమానమేనని టాక్‌ వినిపిస్తున్నప్పటికీ అందులో నిజం లేదని ఆ మధ్య చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పష్టం చేశారు.