గంగూలీ కంటే ధోని బెస్ట్ కెప్టెన్...

గంగూలీ కంటే ధోని బెస్ట్ కెప్టెన్...

ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుత బీసీసీఐ బాస్ మరియు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కంటే గొప్ప కెప్టెన్ అని తేలింది. ఈ మధ్య నిర్వహించిన క్రికెట్ సర్వేలో. ధోని గంగూలీ కంటే కొంచెం ముందంజలో ఉన్నారు. వన్డే కెప్టెన్సీలో ధోని 8.1 రేటింగ్ సాధించగా గంగూలీని 6.8 తో నిలిచాడు. అయితే మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, కుమార్ సంగక్కర, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, క్రిస్ శ్రీకాంత్ ఈ సర్వేలో పాల్గొని భారత గొప్ప కెప్టెన్ ను నిర్ణయించారు. ఇక సౌరవ్ గంగూలీ వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ మరియు జహీర్ ఖాన్ వంటి నాణ్యమైన క్రికెటర్లను ఎంఎస్ ధోనికి ఇచ్చినందుకు అతని పని సులభతరం అయిందని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. ఇక భారతదేశం చివరిసారిగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ గెలుచుకుంది మరియు అప్పటి నుండి ఐసీసీ పోటీలలో విఫలమైంది. ఇటీవల ముగిసిన 2019 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ తో సెమీఫైనల్లో మెన్ ఇన్ బ్లూ ఓడింది.