చెన్నై గెలిచిన ధోని ఫాన్స్ సంతోషంగా లేరంట..

చెన్నై గెలిచిన ధోని ఫాన్స్ సంతోషంగా లేరంట..

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ 2020 ప్రారంభమైంది. ఏడాదికి పైగా క్రికెట్ కు దూరమైన ధోని తిరిగి  క్రికెట్ లోకి తిరిగి రావడం అందరికి ఆనందాన్ని కలిగించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో ధోని జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అయిన ధోని ఫాన్స్ సంతోషంగా లేరంట. ఎందుకంటే నిన్న మ్యాచ్ ఎవరు గెలుస్తారు అని చూసినవారికంటే ధోని హిట్టింగ్ కోసం చుసిన వారే ఎక్కువ. అయితే మ్యాచ్ చివరి దశకు చేరుకున్న తర్వాత అసలు ధోనికి బ్యాటింగ్ అవకాశం వస్తుందా... అనే అనుమానం అందరిలోనూ వచ్చింది. కానీ యువ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ ఔట్ అయిన తర్వాత ధోని ఎంట్రీతో అందరు ఆనందం వ్యక్తం చేసారు. కానీ వచ్చిన తర్వాత ఫాస్ట్ బాల్ కే ధోని ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. కానీ రివ్యూ లో నాట్ ఔట్ అని రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా ధోనికి ఆడే అవకాశం రాలేదు. రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన ధోని ఒక పరుగుకూడా చేయలేదు. అందుకే చెన్నై గెలిచిన ధోని ఫాన్స్ సంతోషంగా లేరంట.