మీకు తెలుసా..? మిస్టర్ కూల్‌కి కోపం కూడా వస్తుంది..!

మీకు తెలుసా..? మిస్టర్ కూల్‌కి కోపం కూడా వస్తుంది..!

మిస్టర్ కూల్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీకి ఉన్న మరో పేరిది.. మ్యాచ్‌ ఏమైపోతోందోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నా.. టీమ్‌లోని ఆటగాళ్లు ఒత్తిడికి గురి అవుతున్నా.. ప్రత్యర్థి ఆటగాళ్లపై చిర్రుబొర్రు ఆడుతున్నా.. నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతున్నా ధోనీ మాత్రం కూల్‌గా ఉంటాడు. ఇక అలాంటి సమయంలోనూ ధనాధన్ సిక్సులు బాదేస్తాడు.. పటాపట్ వికెట్లు పడేలా వ్యూహాలు రచిస్తాడు.. కానీ, ధోనీకి కూడా కోపం వస్తుంది.. అసహనం అనిపిస్తోందట.. అందరిలానే మైదానంలో అసహనం, కోపం తనకీ వస్తాయని ఈ మాజీ కెప్టెన్‌ తెలిపాడు.. అయితే, తను భావోద్వేగాలను నియంత్రించుకోగలనని అన్నాడు. మాస్టర్‌కార్డ్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా ధోనీ మాట్లాడాడు. గ్రౌండ్లో క్రికెట్ ఆడే ఆ క్షణంలో తన భావోద్వేగాల కంటే  జట్టును ముందుకు నడిపించడమే తనకు ముఖ్యమని కామెంట్ చేశాడు. వాటిని అధిగమించి మ్యాచ్‌పైనే దృష్టి సారిస్తానని చెప్పాడు. భావోద్వేగాల  గురించి మర్చిపోతానని అన్నాడు మిస్టర్‌ కూల్‌.. ఆటలో భావోద్వేగాలు సహజం.. వాటిని నియంత్రించుకున్నాడే మిస్టర్ కూల్ అవుతాడు మరి.