ధోనీకి జరిమానా..!

ధోనీకి జరిమానా..!

మిస్టర్‌ కూల్‌గా పేరుపొందిన మహేంద్ర సింగ్‌ ధోనీ.. తొలిసారిగా అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. నిన్న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైకి గెలుపు కోసం 3 బంతుల్లో 8 పరుగులు అవసరమైన తరుణంలో సాంట్నర్‌ 2 పరుగులు చేశాడు. ప్రధాన అంపైర్‌ హైట్‌ దీనిని తొలుత నోబాల్‌గా ప్రకటించి... ఆ తర్వాత లెగ్‌ అంపైర్‌ కాదనడంతో వెంటనే నోబాల్‌ కాదంటూ మాటమార్చాడు. అంపైర్లను నాన్‌స్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న రవీంద్ర జడేజా ప్రశ్నించాడు. అప్పటికీ అంపైర్లు అదే మాట మీద ఉండడంతో కెప్టెన్‌ ధోని మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. ధోనీ వచ్చినా..అది నోబాల్‌ కాదంటూ అంపైర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ధోనీ మ్యాచ్‌ ఫీజులో సగం కోత విధించారు. అది నోబాలా కాదా అనే విషయం పక్కనపెడితే.. డగౌట్‌లో ఉన్న ధోనీ.. నేరుగా గ్రౌండ్‌లోకి వచ్చి అంపేర్ల నిర్ణయాన్ని ప్రశ్నించడం వివాదాస్పమైంది.