నెట్స్‌లో శ్రమిస్తున్న ధోనీ

నెట్స్‌లో శ్రమిస్తున్న ధోనీ

తొలి వన్డేలో ఓటమిని ఎదుర్కొన్న టీమిండియా రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ డిసైడర్ మ్యాచ్ రేపు ఉదయం మెల్బోర్న్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ కీలకం అవడంతో భారత ఆటగాళ్లు నెట్స్‌లో సీరియస్‌గా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ చాలాసేపు నెట్స్‌లో శ్రమించాడు. భారీ షాట్స్ ఆడుతూ మంచి టచ్ లో కనిపించాడు. 

ధోనీతో పాటు కార్తీక్, రోహిత్, ధావన్, రాయుడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మరోవైపు స్పిన్నర్ యజ్వేంద్ర చహాల్ కూడా పాడ్స్ కట్టుకున్నాడు. ధావన్ కు హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచనలు చేశారు. ఇక రెండో వన్డేలో విజయం సాధించడంతో.. చివరి వన్డేలో భారత్ జట్టులో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు.