ఉప్పల్ వన్డేకు ధోనీ డౌటే..!

ఉప్పల్ వన్డేకు ధోనీ డౌటే..!

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి వన్డేకు మిస్టర్ కూల్, టీమిండియా వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ దూరమయ్యేలా కనిపిస్తోంది. నిన్న ప్రాక్టీస్ సెషన్ లో గాయపడడంతో ఆస్ట్రేలియాతో జరగనున్న తొలివన్డేకు ఆడటం అనుమానంగా మారింది. శుక్రవారం భారత క్రికెట్‌ జట్టు ప్రాక్టీస్‌ చేస్తుండగా ధోని ముంజేతికి గాయమైంది. వేగంగా విసిరిన బంతి ధోని కుడిచేతికి బలంగా తగలడంతో ఎక్కువసేపు ప్రాక్టీస్‌ కూడా చేయలేదు. ఈ క్రమంలోనే అతను తొలి వన్డేకు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తొలి వన్డేలో ధోని ఆడతాడా.. లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తొలి వన్డేకు ధోని దూరమైతే.. టీమిండియాకు గట్టి దెబ్బె అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్‌కు ధోనీ దూరమైతే.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత తుది జట్టులోకి రానున్నాడు.