మిస్టర్ కూల్ మరో కొత్త ఇన్నింగ్స్..

మిస్టర్ కూల్ మరో కొత్త ఇన్నింగ్స్..

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ మరో వ్యాపారంలో అడుగుపెట్టాడు. గురుగ్రామ్‌ కేంద్రంగా నడిచే కార్స్‌24 సంస్థలో పెట్టుబడి పెట్టాడు. ఆ సంస్థలో ధోనీ కొంతమేర వాటా సొంతం చేసుకోవడమే కాకుండా ప్రచారకర్తగా వ్యవహరిస్తాడు. ఐతే మహీ పెట్టుబడి విలువెంతో బహిర్గతం చేయలేదు. 2021 కల్లా 300 పట్టణాల్లో ఫ్రాంచైజీలు విస్తరించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. పాత కార్ల కొనుగోలు, విక్రయాలకు దేశంలోని అతిపెద్ద వేదికల్లో కార్స్‌24 ఒకటి. మరోవైపు ధోనీకి ఉన్న గుర్తింపు, క్రేజ్ తమకు ప్లస్ అవుతుందని కార్స్24కు భావిస్తోంది. భారతదేశంలోని మోస్ట్ ట్రస్టెడ్ ప్రీ-ఓన్డ్ కార్ సేల్స్ కంపెనీగా అవతరించేందుకు ఇది ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. కార్స్24ను 2015లో ప్రారంభించారు. క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది కార్స్ 24.