సన్నీలియోన్ కన్నా ధోనినే ప్రమాదకరం.. ఎలాగంటే..!!

సన్నీలియోన్ కన్నా ధోనినే ప్రమాదకరం.. ఎలాగంటే..!!

తమ అభిమాన తారల కోసం, రాజకీయ నాయకుల కోసం, క్రికెటర్ల కోసం నెట్ లో సెర్చ్ చేస్తుంటారు.  ఇలా సెట్ లో సెర్చ్ చేసే సమయంలో కావాల్సిన లింకులతో పాటుగా కానీ కొన్ని లింక్స్ కనిపిస్తుంటాయి.  ఎట్రాక్ట్ గా ఉండే ఆ లింకులను క్లిక్ చేస్తే.. కావాల్సిన సమాచారం కంటే.. వేరే సైట్స్ కు రీ డైరెక్ట్ అవుతుంది.  పోర్న్ సైట్స్ ఓపెన్ అవుతుంటాయి.  తెలియకుండా పొరపాటుగా ఓపెన్ చేస్త ఇక అంతే.  

గూగుల్ లో సమాచారం కోసం సెర్చ్ చేసే సమయంలో ఇలాంటి లింక్స్ ఎక్కువగా ఓపెన్ అవుతుంటాయి. ధోని గురించి అభిమానులు ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు.  ధోని గురించి సమాచారం వెతికే క్రమంలో ఇలాంటి సైట్స్ ఎక్కువగా ఓపెన్ అవుతున్నట్టు మెకాఫీ సంస్థ తెలిపింది.  దీంతో ధోని ప్రమాదకరమైన వ్యక్తిగా మారిపోయాడు. ఈ లిస్ట్ లో ధోని ప్రధమ స్థానంలో ఉండగా, సచిన్ రెండో స్థానంలో ఉన్నాడు, మూడో స్థానంలో టివి నటి గౌతమ్ గులాటి ఉండగా, నాలుగో స్థానంలో సన్నీలియోన్ ఉండటం విశేషం.