ఐపీఎల్ నుంచి తప్పుకో... ఇలా చూడలేకపోతున్నాము

ఐపీఎల్ నుంచి తప్పుకో... ఇలా చూడలేకపోతున్నాము

ఐపీఎల్ 2020 లో చెన్నై వరుస పరాజయాల కారణంగా దాదాపు ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకుంది. ఈ ఆటను చూస్తుంటే.. అసలు ఇది చెన్నై జట్టేనా అనే అనుమానం కలుగుతుంది, బ్యాటింగ్ అలాగే బౌలింగ్ లో విఫలమైన చెన్నై ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ లలో కేవలం 3 మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. జట్టు వైఫల్యం పై చెన్నై అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆటను చూడలేకపోతున్నాము అని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా కెప్టెన్ ధోని ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని కోరుతున్నారు. కెప్టెన్ కూల్ గా పేరు సంపాదించుకున్న ధోని తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. కానీ ఈ సీజన్ లో మాత్రం అతని కెప్టెన్సీ మార్క్ కనిపించడం లేదు. అందువల్ల ధోని గౌరవంగా తప్పుకోవాలని అతని అభిమానులు సూచిస్తున్నారు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ధోనిని చూడ లేకపోతున్నాము అంటున్నారు. దాంతో మిగిత జట్ల అభిమానులు ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు ఇప్పుడు చెన్నై ఫాన్స్ కు మా బాధ ఏంటో తెలిసిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.