ధోనీకి అదే చివరి మ్యాచ్? రిటైర్మెంట్ పక్కా..!?

ధోనీకి అదే చివరి మ్యాచ్? రిటైర్మెంట్ పక్కా..!?

మిస్టర్ కూల్, బెస్ట్ ఫినిషర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌పై ఈ మధ్య తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.. ధోనీ మంచి స్కోర్ చేస్తున్నా.. ఫాస్ట్‌గా పరుగులు చేయడం లేదని.. జిడ్డు ఆట ఆడుతున్నాడని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఇలాంటి వార్తలతో భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సంచనల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే తాను రిటైర్‌అవుతానని బీసీసీఐకి సమాచారం అందించినట్టు ప్రచారం సాగుతోంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మెగా సిరీస్‌లో భారత్ ఆడే చివరి మ్యాచే తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌గా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారులు ధృవీకరించినట్లు తెలుస్తోంది. ఓవైపు విమర్శలు వస్తున్న తరుణంలో... మరింత ఆలస్యం చేయకుండా గుడ్ బై చెప్పడమే మేలు అనే యోచనలో మిస్టర్ కూల్ ఉన్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. మరి ధోనీ అధికారికంగా ఈ విషయంపై ఎప్పుడు ప్రకటన చేస్తాడు? ఎప్పుడు రిటైర్ అవుతారు? ఈ సిరీస్‌లో మరింత పుంజుకొని మరింత కాలం భారత జట్టులో కొనసాగుతారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.