మళ్లీ బ్యాట్‌పట్టిన మిస్టర్ కూల్..

మళ్లీ బ్యాట్‌పట్టిన మిస్టర్ కూల్..

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్‌ ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్న ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. రాంచీలోని జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్‌ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. వరల్డ్‌కప్‌లో కివీస్‌తో ఓటమి తర్వాత.. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ఆడలేదు. విశ్రాంతి కావాలని సెలక్టర్లను కోరాడు. జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత ధోనీపై ఊహాగానాలు మొదలయ్యాయి. ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడని వార్తలు సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేశాయి. వీటికి ధోనీ సమాధానం ఇవ్వలేదు. టీమిండియా సెలక్టర్లు జవాబు చెప్పలేదు. మిస్టర్‌ కూల్‌ సైలెంట్‌గా ఉండటంతో అతని అభిమానులు.. చాలా నిరుత్సాహపడ్డారు. 

అయితే, ఇప్పుడు ధోనీ ప్రాక్టీస్‌ షురూ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్న ధోనీ మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. నెట్స్‌లో ధోని జార్ఖండ్ బౌలర్లు సంబంధించిన బంతులను ఎదుర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన ధోనీ.. వెస్టిండిస్‌ సిరీస్‌కి పూర్తి ఫిట్‌నెస్‌తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నట్లు టాక్‌ విన్పిస్తోంది. ఈ పర్యటన కోసమే పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ అందుకోవడానికి జార్ఖండ్‌ అండర్‌-23 జట్టుతో కలిసి ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నాడని వార్తలు హాల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో ధోనీ విండీస్‌ పర్యటనకు ఎంపికయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని మాజీలు అభిప్రాయపడుతున్నారు.