ధోనీకి షాకిచ్చిన బీసీసీఐ

ధోనీకి షాకిచ్చిన బీసీసీఐ

 ఎంఎస్ ధోనీ త్వరలో వన్డేలకూ గుడ్ బై చెబుతాడని టీమిండియా కోచ్ రవిశాస్త్రి చెప్పిన కొన్నిరోజులకే బీసీసీఐ ఫ్యూచర్ కాంట్రాక్టులో మహీ పేరు లేకపోవడం కలకలం రేపుతోంది. 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్ల జాబితా ప్రకటించిన బీసీసీఐ సీనియర్ మెన్స్ టీమ్ లో ధోనీ పేరు చేర్చలేదు. దీంతో ధోనీ కెరీర్ కు ముగింపు పలికికనట్టేనా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్ లో బాగా ఆడితే టీట్వంటీ వరల్డ్ కప్ కు ధోనీ పేరు పరిశీలిస్తామని కూడా రవిశాస్త్రి చెప్పినా ఇప్పుడు కాంట్రాక్టులో పేరు లేకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంకా రిటైర్మెంట్ ప్రకటించని ధోనీ పేరు లేకుండా చేసి బీసీసీఐ ఘోరంగా అవమానించిందని సోషల్ మీడియాలో అభిమానులు బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. వరల్డ్ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని.. అప్పటి నుంచి ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు.తాను రిటైర్మెంట్ తీసుకుంటానని ఇప్పటికే బీసీసీఐ పెద్దలకు ధోని సమాచారం ఇచ్చినట్లు, అందుకే బీసీసీఐ కాంట్రాక్టులో చోటు ఇవ్వలేదని తెలుస్తోంది.