భారీగా ఆదాయపు పన్ను కట్టిన 'మహి'

భారీగా ఆదాయపు పన్ను కట్టిన 'మహి'

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారీ మొత్తంలో ఆదాయపు పన్నును చెల్లించాడు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ధోని రూ.12.17 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. దీంతో జార్ఖండ్ లో అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా ధోని నిలిచాడట. అయితే గత సంవత్సరం ధోని రూ.10.93 కోట్లను చెల్లించాడు. అంటే ధోని ఈ ఏడాది రూ.1.24 కోట్లు ఎక్కువ పన్నును కట్టాడు. హకీ ఇండియా లీగ్ లో రాంచీ రేస్ జట్టుకు, ఇండియా సూపర్ లీగ్ లో చెన్నయిన్  ఎఫ్సీకి ధోని సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇక 2017లో 'సెవన్' పేరిట వస్ర్త దుకాణాలను కూడా ప్రారంభించారు. ఐపీల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కూడా వాటా ఉన్నట్టు సమాచారం.