ధోని ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నాడు..?

ధోని ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నాడు..?

భారత జట్టు మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గత కొన్ని రోజులుగా క్రికెట్ దూరంగా ఉంటున్నాడు.  ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ తరువాత ధోని వెస్ట్ ఇండీస్ లో జరిగే మ్యాచ్ లకు దూరంగా ఉండాలని అనుకున్నాడు.  ఆ సమయంలో రెండు నెలలపాటు అయన ఆర్మీలో పనిచేశారు. జమ్మూ కాశ్మీర్లో అయన ప్రత్యేకంగా విధులు నిర్వహించారు.  అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లకు కూడా ధోని దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది.  ధోని లేకుండానే వెస్ట్ ఇండీస్ లో కోహ్లీ జట్టు మూడు ఫార్మాట్లలోను విజయం సాధించింది.  

దీంతో అదే టీమ్ ను ఇండియాలో జరిగే మ్యాచ్ లలో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారు.  ఇప్పటికే చిన్న చిన్న మార్పులతో టెస్ట్ జట్టును ప్రకటించారు.  బిసిసి జట్టును ప్రకటించిన కొద్దిసేపటికే ధోని రిటైర్మెంట్ కాబోతున్నట్టు వార్తలు రావడంతో బిసిసిఐ షాక్ అయ్యింది.  తమ దగ్గర ధోని రిటైర్మెంట్ కు సంబంధించిన సమాచారం లేదని చెప్పింది.  ధోని అలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోవడం లేదని చెప్పింది.  కాగా, ఈరోజు సాయంత్రం 7 గంటలకు ధోని ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.  ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారన్నది సస్పెన్స్ గా మారింది.  ఒకవేళ ధోని తన రిటైర్మెంట్ కు సంబంధించిన న్యూస్ చెప్పబోతున్నారని, రిటైర్మెంట్ తరువాత ధోని బీజేపీలో చేరతారని అంటున్నారు.  త్వరలోనే ఝార్ఖండ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి బీజేపీ తరపున అయన పోటీ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.