చెన్నైకి ధోని... మొదలైన ఐపీఎల్‌-2021 సందడి...

చెన్నైకి ధోని... మొదలైన ఐపీఎల్‌-2021 సందడి...

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 సందడి మొదలైంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ చెన్నైకి చేరుకోవడంతో ఫ్రాంచైజీలో కోలాహలం నిండింది. నగరానికి చేరుకున్న అతడికి హోటల్‌, ఫ్రాంచైజీ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. తన గదికి చేరుకుంటున్నంత సేపు మహీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. అతడు నగరానికి చేరుకున్న వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్‌ ట్వీట్‌ చేసింది. అంతకుముందే అంబటి రాయుడు శిబిరానికి చేరుకున్నాడు.  ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసు పూర్తవ్వగానే చెతేశ్వర్‌ పుజారా సైతం శిబిరానికి చేరుకోనున్నాడు. ప్రాక్టీస్‌ మార్చి 9 నుంచి ఆరంభమవుతుందని సీఎస్‌కే తెలిపింది.