ఆ ఆటగాడు జట్టును నాశనం చేస్తాడు అని ధోని చెప్పాడు...

ఆ ఆటగాడు జట్టును నాశనం చేస్తాడు అని ధోని చెప్పాడు...

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంత విజయవంతమైన కెప్టెనో అందరికి తెలుసు. అయితే అతని విజయానికి గల కారణాలలో ఒకటి ఆటగాళ్లను అంచనా వేయడం. ధోని ఆటగాళ్ళని అంచనా వేయడంలో సమర్ధుడు. అందుకే ఐపీఎల్ లో తాను ప్రాతినిధ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్  జట్టు యాజమాన్యానికి ధోని ఒక సలహా ఇచ్చాడట. అదేంటంటే ఆ ఆటగాడు జట్టులోకి వస్తే నాశనం చేస్తాడు అని.  ఈ విషయాని స్వయంగా ఒకప్పటి ఆ జట్టు అధికారి ఎన్‌ శ్రీనివాసన్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. ''నేను ఒకసారి సీఎస్‌కేలోకి ఓ స్టార్ ఆటగాడిని  తీసుకుందామని ధోనికి చెప్పను . అతను గొప్ప ప్లేయర్. కానీ అప్పుడు ధోని నాతో " వద్దు సార్ అతను జట్టులోకి వస్తే జట్టును నాశనం చేస్తాడు" అని అన్నాడు. కాబట్టి ఆ ఆటగాడిని మేము తీసుకోలేదు అని చెప్పాడు. ఇక ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో 2 సీజన్లు సీఎస్‌కే సస్పెండ్ కు గురైంది. ఇక మిగితా 10 సీజన్లలో ధోని జట్టు 3 టైటిల్స్ అందుకుంది.