ధోనీకి రెస్ట్.. రైనాకు పగ్గాలు..

ధోనీకి రెస్ట్.. రైనాకు పగ్గాలు..

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది చెన్నై జట్టు. అయితే, చైన్నై జట్టును విజయపతంలో నిడిపిస్తున్న కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. గాయంతో బాధపడుతున్న ధోనీకి రెస్ట్ ఇవ్వగా... కెప్టెన్సీ పగ్గాలు సురేష్ రైనాకు అప్పగించారు. ఇప్పటి వరకు చెన్నై జట్టుకు ఆడే సమయంలో మూడు సార్లు మాత్రమే మ్యాచ్‌లకు దూరమయ్యాడు ధోనీ.. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లలో ఓడిన చెన్నై.. ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.