ధోని...రిటైర్మెంట్ టు రీ ఎంటర్టైన్మెంట్... 

ధోని...రిటైర్మెంట్ టు రీ ఎంటర్టైన్మెంట్... 

మహేంద్ర సింగ్ ధోని 437 రోజుల తరువాత తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెడుతున్నాడు.  2019 వరల్డ్ కప్ సెమిస్ మ్యాచ్ తరువాత తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టలేదు.  అయితే, ఐపీఎల్ మ్యాచ్ లకు ముందు ఆగష్టు 15 వ తేదీన సాయంత్రం 7:29 గంటలకు ఇంస్టాగ్రామ్ ద్వారా తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.  7:29 గంటల నుంచి క్రికెట్ కు రిటైర్ అవుతున్నట్టు భావించాలని ప్రకటించడంతో ధోని ఫ్యాన్స్ షాక్ అయ్యారు.  ఆగష్టు 15 వ తేదీ సాయంత్రం 7:29 కి ఫ్యాన్స్ కు షాకిచ్చిన ధోని, సెప్టెంబర్ 19 వ తేదీ సాయంత్రం 7:30 గంటలు ఐపీఎల్ 13 వ సీజన్ ద్వారా తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టి రీ ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాడు.  రాత్రి 7:30 గంటలకు గ్రౌండ్ లోకి అడుగుపెట్టగానే ధోని ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.  రిటైర్మెంట్ కు రీ ఎంటర్టైన్మెంట్ కు ఒక్క నిమిషం మాత్రమే గ్యాప్ అని, ఐపీఎల్ 13 సీజన్ లో ధోని తనదైన శైలిలో దుమ్ము దులిపేస్తాడని, చెన్నై టైటిల్ గెలవడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.