సిఎస్కే రంగులతో నింపిన ఇంటి పై స్పందించిన ధోని...?

సిఎస్కే రంగులతో నింపిన ఇంటి పై స్పందించిన ధోని...?

చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ ఎంఎస్ ధోనికి తమిళనాడు లో ఉన్న ఫాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం ఆ జట్టు అంతగా రాణించలేకపోతుంది. అందువల్ల ధోని పై చాలా విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ సమయంలోనే  గోపికృష్ణన్ అనే ధోని అభిమాని తన ఇంటికి మొత్తం చెన్నై రంగు అయిన పసుపుతో నింపేసాడు. తన ఇంటి ముందు గోడల పైన ధోని చిత్రాలని, పక్క గోడలపైన సీఎస్కే లోగో ను అలాగే "విజిల్ పోడు" అనే ట్యాగ్ లైన్ ను పెయింట్ చేయించాడు. తాజాగా ఈ విషయం పై ధోని మాట్లాడుతూ... ''' నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఇల్లును చూశాను. ఒక ఇల్లు నిర్మించుకునేవారికి ఎన్నో కలలు ఉంటాయి. ఆ ఇంట్లో ఎవరికి నచ్చకపోయినా ఆ ఇంటికి విలువ ఉండదు. అయితే.. ఇక్కడ ఆ అభిమాని చెన్నై జట్టుపై అభిమానంతో ఇల్లు నిర్మించాడు. ఆ కుటుంబ సభ్యులందరికి నా కృతజ్ఞతలు'' అని ధోని తెలిపాడు. అయితే ఈ ఇల్లుకు రంగులు వేయించడానికి గోపికృష్ణన్ రూ .1.50 లక్షలు ఖర్చు చేశారు. ఆ ఇంటి ఫోటోలను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.