ధోని బర్త్ డే సాంగ్... విడుదలైన కొన్ని గంటలోనే... 

ధోని బర్త్ డే సాంగ్... విడుదలైన కొన్ని గంటలోనే... 

జూలై 7, అంటే ఈ రోజు ఎంఎస్ ధోని తన 39 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో తన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ పుట్టినరోజు సందర్భంగా 'హెలికాప్టర్ 7' పాటను విడుదల చేసి ధోనికి ప్రత్యేక పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు.  అయితే ఈ పాటలో  ''రాంచీలోని ధోని మూలాలను ప్రస్తావించడం నుండి, వన్డేల్లో తనని 3 వ స్థానంలో ఆడటానికి ప్రోత్సహించినందుకు సౌరవ్ గంగూలీకి కృతజ్ఞతలు చెప్పడం, అలాగే  ఈ పాటలో 'హెలికాప్టర్ సెలబ్రేషన్' తో సహా  బ్రావో ధోని అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా ఆతనికి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో ఉండడేలా చూసుకున్నాడు. ఇక ఈ ధోని పై పాట రాస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించిన  బ్రావో ఈ రోజు తన అధికారిక  యూట్యూబ్‌ ఛానెల్ లో విడుదల చేసాడు. అయితే పాట విడుదల అయిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఇక ఇప్పటివరకు పాట బయటకు వచ్చిన 17 గంటల్లో 3,76,436 వ్యూస్ సంపాదించుకుంది.