మిస్టర్ కూల్ అంతే... అందరినీ ఆశ్చర్యపరిచాడు...!

మిస్టర్ కూల్ అంతే... అందరినీ ఆశ్చర్యపరిచాడు...!

మిస్టర్ కూల్‌గా పిలవబడే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు... ఓ వైపు బీసీసీఐ ధోనీని కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించింది. ఇక, ధోనీ కెరీర్ ముగిసినట్టే... టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన మాజీ కెప్టెన్‌కు వీడ్కోలు తెలపకుండానే ఇలా సాగనింపేస్తారా? అనే చర్చ మొదలైంది. అయితే, ఈ వ్యవహారం తనకు సంబంధించినది కాదన్నట్టుగా మల్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు ధోనీ... బీసీసీఐ కాంట్రాక్టు నిరాకరించిన రోజే.. ఝార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు మిస్టర్ కూల్. ఇకపై రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేయనున్నట్టు తెలుస్తోంది.. మరోవైపు ఐపీఎల్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ఈ సీజన్‌లో సత్తా చాటాలన్న ఉద్దేశంతో సాధన ప్రారంభించారని చెబుతున్నారు. ధోనీ రాకపై ఝార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అకస్మాత్తు జరిగిన ఈ పరిణామం మమ్మల్ని ఎంతో ఆనందానికి గురిచేసిందని చెబుతున్నారు.